కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజీవ్ భూషణ్ 7 రాష్గ్రాలను తీవ్రంగా హెచ్చరించారు. 7 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం పెరిగిందని, జాగ్రత్తగా వుండాలని హెచ్చరించారు. మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం దాటిందన్నారు. ఈ రాష్ట్రాల్లో కచ్చితంగా 5 అంచెల కట్టడి వ్యూహాన్ని అమలు చేయాల్సిందేనని రాజేశ్ భూషణ్ ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులను హెచ్చరించారు. అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ఇక.. రాబోయేవి పండగ రోజులని, సామూహిక కార్యక్రమాలు బాగా జరుగుతాయని తెలిపారు. అందువల్ల ఈ 7 రాష్ట్రాల్లో చాలా జాగ్రత్తగా వుండాలని కేంద్రం హెచ్చరించింది.
