ఏపీ రాజధాని అమరావతిపై కేంద్ర హోంశాఖ పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది. ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటైందని కేంద్రం వ్యాఖ్యానించింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అమరావతిపై అడిగిన ప్రశ్నకు కేంద్రం పై విధంగా పేర్కొంది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్లు 5,6 తో అమరావతి ముడిపడి వుందని కేంద్ర హోంశాఖ గుర్తు చేసింది.
అమరావతే రాజధాని అని 2015 లోనే నిర్ణయించారని, ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో వుందని పేర్కొన్నారు. దీనిపై మాట్లాడుకోవడం కోర్టు ధిక్కరణ కిందే వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. 2020 లో ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు తెచ్చిందని, ఈ విషయంలో మాత్రం జగన్ ప్రభుత్వం తమను సంప్రదించలేదని కేంద్రం పేర్కొంది.