కే్ంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రాల పన్నుల వాటా కింద వచ్చే నిధులను విడుదల చేసింది. ఇప్పటికే మొదటి వాటా కింద 58,332 కోట్లను కేంద్ర విడుదల చేసింది. తాజాగా రెండో వాటా కింద రాష్ట్ర ప్రభుత్వాలకు 1,16,665.75 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వానికి 4,721 కోట్లను విడుదల చేసింది. ఇక…. తెలంగాణకు 2,452 కోట్లను విడుదల చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు సర్వతో ముఖఅభివృద్ధికి తాము కట్టుబడి వున్నామనడానికి పన్నుల విడుదలే గొప్ప నిదర్శనమని కేంద్రం పేర్కొంది. అయితే.. ఈ వాటా కింద యూపీకి అత్యధికంగా 20,928 కోట్లు విడుదల కాగా… ఆ తర్వాత బిహార్ నిలిచింది. ఇక.. చివరగా గోవా రాష్ట్రం జాబితాలో వుంది.
