తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీ రావుతో భేటీ అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లిన షా…. రామోజీ రావును కలుసుకున్నారు. రామోజీ రావు అమిత్ షా కు పుష్పగుచ్ఛం అందించి, సాదరంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత వారిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. అయితే… ఇది కేవలం మర్యాద పూర్వక భేటీయేనని, షెడ్యూల్ కూడా వున్నదేనని తెలంగాణ బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సభ ముగిసిన తర్వాత షా… రామోజీ రావుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత నగరంలోని నోవాటెల్ హోటల్ కి వెళ్లారు. నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు.
