కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీలో పర్యటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా తమ ప్రభుత్వం ఆధ్యాత్మిక టూరిజాన్ని డెవలప్ చేస్తున్నామని ప్రకటించారు. స్వదేశీ దర్శన్ కింద 7 కోట్లు ఖర్చు చేస్తున్నామని, దేశంలో 50 పర్యాటక ప్రాంతాలను డెవలప్ చేస్తామని బడ్జెట్ లో కూడా చెప్పామన్నారు. నాగార్జున కొండను డెవలప్ చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు. కాకినాడ వైల్డ్ లైఫ్ సెంచరీ, బుడమేరు, యశ్యానం, మైపాడ్ బీచ్, బౌద్ధమత సర్కూట్, అమరావతి ప్రాంతాలను డెవలప్ చేస్తున్నామని ప్రకటించారు. స్వదేశీ దర్శన్ స్కీంలో కడప గండికోట, అరకు, లంబసింగి ప్రాంతాలను డెవలప్ చేస్తామని ప్రకటించారు.
విశాఖ నుంచి అరకు వరకు డెవలప్ చేస్తున్నామని, అద్దాలతో కూడిన రైల్ ను ఏర్పాటు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. సింహాచలం, అరుణాచలం దేవాలయాలను ఈ సంవత్సరం డెవలప్ చేస్తామని ప్రకటించారు. నెల్లూరు వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని డెవలప్ చేయడానికి ఈ యేడాది సహాయం అందిస్తామన్నారు. కరోనా తర్వాత… 2022 నుంచి పర్యాటక శాఖ నిరంతరాయంగా డెవలప్ అవుతోందని తెలిపారు. గండికోట ఫోర్ట్ , లంబసింగిలో మ్యూజియం ఏర్పాటు.. రాష్ట్రానికి పర్యాటక అభివృద్ధి కింద రూ. 120 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.27.07 కోట్లతో అమరావతి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. టూరిజం ప్రగతికి ప్రధాని మోదీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. విద్యాసంస్థల్లో యువ టూరిజం క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
మరోవైపు ఏపీలో రైల్వే ప్రాజెక్టుల కోసం గత బడ్జెట్ లో కంటే ఈ సారి 20 శాతం అధికంగా కేటాయించామన్నారు. మచిలీపట్నం వరకూ పొడిగించిన ధర్మవరం- విజయవాడ రైలును విజయవాడలో జెండా ఊపి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మరికొన్ని రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రటకించారు. విజయవాడ విమానాశ్రయం మాదిరిగా రైల్వే స్టేషన్ ను కూడా డెవలప్ చేస్తామని ప్రకటించారు. డీపీఆర్ సిద్ధమయ్యాక… పనులు చేపడతామని ప్రకటించారు. హైదరాబాద్ కి రైళ్లలో వచ్చే ఏపీ ప్రజల సౌకర్యం కోసం చర్లపల్లి వద్ద న్యూ రైల్వే టెర్మినల్ కడతామని ప్రటకించారు.