Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

వివాదంలోకి స్మృతి ఇరానీ.. రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్.. తిప్పికొట్టిన స్మృతి ఇరానీ

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె కుమార్తె జోయిష్ ఇరానీ నడుపుతున్న బార్… మోసపూరిత మార్గాల ద్వారా మద్యం లైసెన్స్ పొందిందని గోవా ఎక్సైజ్ శాఖ ఇరానీ కూతురు జోయిష్ నడుపుతున్న సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్ కు
షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరణించిన వ్యక్తి పేరును ఉపయోగించుకొని, రెస్టారెంట్ లో మద్యం లైసెన్స్ ను పొందారని వెలుగులోకి రావడంతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వివాదంలో ఇరుక్కున్నారు.

 

రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్…

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. గోవాలో ఆమె కుమార్తె జోయిష్ అక్రమంగా బార్ నడుపుతున్నారని, అందుకే స్మృతి ఇరానీని వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ప్రధాని మోదీని డిమాండ్ చేసింది. ఈ విషయంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా స్పందిస్తూ… ఇరానీ కుటుంబం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోందని, ఆమె కూతురు గోవాలో రెస్టారెంట్ నడుపుతోందన్నారు. అందులో అక్రమంగా నకిలీ బార్ లైసెన్స్ తో బార్ ను నడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర మంత్రి కూతురు మే 2021 లో మరణించిన వ్యక్తి పేరు మీద 2022 జూన్ లో లైసెన్స్ తీసుకున్నారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. అలాగే నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ అధికారిని ఒత్తిడితో బదిలీ చేసినట్లు కాంగ్రెస్ మండిపడింది. తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి స్మృతి ఇరానీని బర్తరఫ్ చేయాలని పవన్ ఖేరా డిమాండ్ చేశారు.

 

తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

తన కూతురు జోయిష్ ఇరానీపై ఆరోపణలు రావడంతో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తన కూతురిపై కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆరోపణలను ఖండించారు. అక్రమంగా బార్ నడుపుతోందన్న ఆరోపణలపై భగ్గుమన్నారు. 18 ఏళ్ల కాలేజీ విద్యార్థి అయిన తన కూతుర్ని కాంగ్రెస్ టార్గెట్ చేసిందన్నారు. గోవాలో తన కూతురుకు ఎలాంటి బార్లూ లేవని స్పష్టం చేశారు. తాను 2014,19 లో అమేథీ నుంచి రాహుల్ పై పోటీకి దిగడమే తాము చేసిన తప్పని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు చూపిస్తున్న పేర్లలో తన కూతురు పేరు ఎక్కడ వుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సూటిగా ప్రశ్నించారు.

Related Posts

Latest News Updates