సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు అరుదైన అవకాశం లభించింది. దేశ ప్రథమ పౌరురాలితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం దక్కింది. అంతేకాదు, రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించే తొలి తెలుగు వ్యక్తిగా ఆయన రికార్డుకెక్కనున్నారు. రాష్ట్రపతి ఎన్నికైన వారితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించడం ఆనవాయితీ. 15వ భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సెంట్రల్ హాల్లో వేదికపై ఆశీనులవగా.. ముర్ముతో జస్టిస్ ఎన్వీ మరణ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ అవకాశం లభించిన తొలి తెలుగు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కావం విశేషం.
