నేటి నుంచి మూడు రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయల సీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో జరిగే మినీ మహానాడులో పాల్గొంటున్నారు. చంద్రబాబు ఏపీలో జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మొదట బెంగళూరుకు వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మదనపల్లి చేరుకుంటారు. అక్కడ ఏపీ సరిహద్దు నుంచి తెలుగు యువత బైక్ ర్యాలీ నిర్వహించనుంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు కేడర్ కు దిశానిర్దేశం చేస్తారు.