టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రాద్రి సీతారాముడ్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శివాజీ మర్యాదలతో స్వాగతం పలికారు. దాదాపు 19 సంవత్సరాల తర్వాత చంద్రబాబు భద్రాద్రికి వెళ్లారు. రామాలయంలోని శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో కూడా పూజలు చేసుకున్నారు. ఆ తర్వాత వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణంతోనే భద్రచలానికి ఏమీ కాలేదన్నారు.
20 ఏళ్ల క్రితం భద్రాచలంలో వరద ముప్పు నుంచి ప్రజల్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కరకట్ట నిర్మించిందని, దాని వల్లే ఇప్పుడు పట్టణమంతా సురకషితంగా వుందన్నారు. ప్రజలంతా గుర్తు పెట్టుకునే విధంగా నిర్మించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు లేకుండా… చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుందని చంద్రబాబు సూచించారు.