తెలంగాణ సంప్రదాయంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం బలగం. ఈ సినిమా అంతటా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బలగం టీమ్ ను ప్రశంసించారు. చిత్రం టీమ్ ను సన్మానించారు కూడా. బలగం సినిమా చూసిన తర్వాత వేణు టిల్లుపై తనకు మరింత గౌరవం పెరిగిందని, తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకున్నాడని మెగాస్టార్ అభినందించారు. మెగాస్టార్ ఓ సినిమాను చూసిన తర్వాత…. ఆ సినిమాని తెరకెక్కించిన వారికి ఫోన్లు చేసి అభినందిస్తుంటారు.
ఇందులో భాగంగానే బలగం టీమ్ ని చిరు సత్కరించారు. బలగం చిత్ర యూనిట్ ని భోలా శంకర్ సెట్స్ కే పిలిపించుకొని మరీ చిరు సత్కరించారు. అందరినీ పేరు పేరునా అభినందించారు. దర్శకుడు వేణుని ప్రత్యేకంగా అభినందించారు. కంగ్రాట్స్ వేణు. గుడ్ జాబ్… నువ్వు సినిమా ఇంత బాగా తీసి మాకు షాకులిస్తే ఎలా? అంటూ సరదాగా చిరంజీవి కామెంట్ చేశారు.