దర్శకులు కె. విశ్వనాథ్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లో కళాతపస్విక కళాంజలి పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే శంకరాభరణం ఝాన్సీ, మంజు భార్గవి, రాజ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, గుండు సుదర్శన్, సబిత, రోజా రమణి, రాధిక, సుమలత, మీనా, జయసుధ, భానుచందర్, ఆమని, మంజరి, అశ్వనీ దత్, యమున కిషోర్, జీవిత రాజశేఖర్, శేఖర్ కమ్ముల, టి.జి. విశ్వప్రసాద్, ఏడిద రాజా తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… విశ్వనాథ్ తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి అని ప్రకటించారు. ఆయనకు తన మనసులో ఎప్పటికీ స్థానం వుంటుందన్నారు. కె. విశ్వనాథ్ తనకు గురువని, సునిశితంగా నటించడం తనవద్ద నుంచే నేర్చుకున్నానని అన్నారు. దర్శకుడిగా అనుక్షణం నా నటనను సరిదిద్దిన గురువుగా.. చిత్రీకరణ సమయంలో ఆయన చూపించే ప్రేమలో తండ్రిగా విశ్వనాధ్ గారిని భావిస్తానని ప్రకటించారు.
ఇక… దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ… భాషతో సంబంధం లేకుండా అందరినీ అలరించేలా ఎప్పుడో పాన్ ఇండియా సినిమాలు తీసిన దర్శకుడు కె. విశ్వనాథ్ అని అన్నారు. భవిష్యత్ తరాలకి తెలుగు సినిమా గురించి చెప్పాల్సి వస్తే… ఈయన సినిమాలు చూపిస్తే చాలన్నారు.