Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మరోసారి ఉదారతను చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. సీనియర్ కెమెరామన్ దేవరాజ్ కి 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఎలాంటి కష్టం వచ్చినా… తాను అండగా వుంటానని ఆయనకు హామీ ఇచ్చారు. దేవరాజ్ ఇటీవల ఓ మీడియా ఛానెల్ లో తన ఆరోగ్య పరిస్థిని చెప్పుకొచ్చాడు. ఆ మధ్య మేజర్ యాక్సిడెంట్ జరిగిందని.. అప్పటి నుంచి సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకి రోజు గడవడమే కష్టంగా ఉందనీ.. మందులకు కూడా డబ్బులు కూడా లేవని తన దీన స్థితిని వెల్లబుచ్చాడు. అయితే ఈ విషయం చిరు దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆయన దేవరాజ్ ను కలిసి ఆర్ధిక సాయంగా అందించారు. సుమారు 300 సినిమాలకి దేవరాజ్ కెమెరామెన్ గా పనిచేశారు. 1980-90 లలో ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాల కోసం కెమెరా మెన్ గా పనిచేశారు.

Related Posts

Latest News Updates