కళాతపస్వి విశ్వనాథ్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనా్ గారు కాలం చేయడం నన్ను కలచివేసింది. ఈ రోజు ఆయన కన్నుమూసిన వార్త విన్న నేను షాక్ కు గురయ్యా. ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయడం నాకే కాదు.. తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా అంటూ పేర్కొన్నారు.
”ఆయన దర్శకత్వంలో శుభలేఖ, ఆపద్బాంధవుడు, స్వయంకృషి అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో వున్నది గురుశిష్యుల సంబంధం. అంతకు మించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైంది. ప్రతి నటుడికీ ఆయనతో పని చేయడం ఒక ఎడ్యుకేషన్ లాంటిది. ఆయన చిత్రాలు భావి దర్శకులకి కూడా ఒక గైడ్ లాంటివి. 43 సంవత్సరాల క్రితం ఆ మహనీయుడి ఐకానిక్ చిత్రం శంకరణాభరణం విడుదలైన రోజునే బహుశ: శంకకుడికి ఆభరణంగా ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.” అని చిరంజీవి ట్వీట్ చేశారు.