తెలుగుదేశం పార్టీ యువనేత చింతకాయల విజయ్‌కు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంలో మార్చి 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చేందుకు నర్సీపట్నంలోని ఆయన నివాసానికి సీఐడీ అధికారులు వెళ్లారు. అయితే.. విజయ్ అందుబాటులో లేకపోవడంతో.. ఆయన తండ్రి, టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి అందజేశారు.
ఈ నోటీసులు తీసుకున్న అయ్యన్నపాత్రుడు కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇలా నోటీసులు ఇస్తున్నారన్నారు . ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రజా అధికారంతో ఇంకెన్నాళ్ళు బీసీల గొంతు నొక్కుతారని మండిపడ్డారు.