శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ నేత పల్లె రఘునాథ్ రెడ్డి కారును వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారిపోయింది. చివరికి పోలీసులు లాఠీఛార్జీ చేసి, టీడీపీ నేత పల్లె రఘునాథ రెడ్డిని అరెస్ట్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పుట్టపర్తిలో పాదయాత్ర సందర్భంగా పుట్టపర్తిలో అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్రీధర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే సత్తెమ్మ దేవాలయంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు.
శ్రీధర్‌రెడ్డి సవాల్‌ను మాజీ మంత్రి పల్లెరఘునాథ్ రెడ్డి స్వీకరించారు. శ్రీధర్‌రెడ్డి చేసిన అవినీతిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రతిసవాల్ చేశారు. సత్తెమ్మ దేవాలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పల్లె చెప్పారు. ఈ క్రమంలో శ్రీధర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి ఈరోజు సత్తెమ్మ దేవాలయానికి వస్తున్నారన్న నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అయితే.. వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ కి పోలీసులు అనుమతి ఇచ్చారు. టీడీపీ నేత పల్లెని మాత్రం హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. చివరికి పల్లె రఘునాథ రెడ్డి హనుమాన్ జంక్షన్ కి చేరుకున్నారు. దీంతో ఇక్కడే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.