హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 16 నుంచి జూన్ 15 వరకు దాదాపుగా 91 రోజుల పాటు జనంలో ఉండే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. అదిలాబాద్ జిల్లాలో బోథ్ నియోజక వర్గం బజరహత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ప్రారంభమై, ఖమ్మం జిల్లాలో పాదయాత్ర ముగుస్తుంది. 39 అసెంబ్లి నియోజక వర్గాలను టచ్ చేస్తూ మొత్తం 1,365 కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకే సీఎల్పీ నాయకుడిగా తెలంగాణ పాదయాత్ర చేయడానికి ముందుకొచ్చినట్లు వివరించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తమ శక్తిమేరకు తనతో నాలుగు అడుగులు వేసి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి మరింత బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని భట్టి పిలుపునిచ్చారు.
