రాజస్థాన్ లోని ఉదయపూర్ దర్జీ కన్హయ్యలాల్ దారుణ హత్యపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ స్పందించారు. హత్యకు కారకులైన ఇద్దరు నిందితులకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు వున్నాయని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకే ఈ హత్య జరిగిందన్న ప్రాథమిక అంగీకారానికి పోలీసులు వచ్చారని తెలిపారు.
దర్జీ కన్హయ్య లాల్ హత్య నేపథ్యంలో సీఎం గెహ్లోత్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన పై వ్యాఖ్యలు చేశారు. నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
उदयपुर की घटना पर आज उच्चस्तरीय समीक्षा बैठक की। पुलिस अधिकारियों ने बताया कि प्रारम्भिक जांच में सामने आया कि घटना प्रथम दृष्टया आतंक फैलाने के उद्देश्य से की गई है। दोनों आरोपियों के दूसरे देशों में भी संपर्क होने की जानकारी सामने आई है।
— Ashok Gehlot (@ashokgehlot51) June 29, 2022
దర్జీ హత్య కేసు తదుపరి విచారణను ఎన్ఐఏ చేపడుతుందని సీఎం గెహ్లోత్ ప్రకటించారు. వారికి రాజస్థాన్ ఏటీఎస్ దళం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం గెహ్లోత్ పేర్కొన్నారు. ఇందుకు సహకరించాలని అన్ని పార్టీలకు కూడా రిక్వెస్ట్ చేశామని పేర్కొన్నారు.