సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తుననారు. ఈ సందర్భంగా పార్నపల్లె పరిధిలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద బోటులో రిజర్వాయర్ అందాలను వీక్షించారు. ఈ సందర్భంగా పలు అభివ్రుద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. తదనంతరం నియోజకవర్గ అభివ్రుద్ధిపై సమీక్ష నిర్వహించారు. అధునాతనంగా నిర్మించిన వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్, అందులోని గెస్ట్ హౌజ్ లు, పార్కుతో పాటు 1.5 కోట్లతో ఏర్పాటు చేసిన నాలుగు సీట్ల స్పీడ్ బోటు, 18 సీట్ల ఫ్లోటింగ్ జెట్టి, పర్యాటక బోటింగ్ సిస్టమ్ ను సీఎం ప్రారంభించారు. తదనంతరం నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.
వైఎస్సార్ జిల్లాలోని చిత్రావతి రిజర్వాయర్ ను సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం జగన్ ప్రకటించారు. చాలా వనరులు అందుబాటులో వున్నాయని, జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షించే విధంగా చేస్తామన్నారు. అవినీతికి, తారతమ్యాలు లేకుండా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాలను అందిస్తోందని వివరించారు. ఓ ప్రణాళికా ప్రకారం వీటన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ఇంటికే చేరుస్తున్నామని సీఎం జగన్ వివరించారు.