రామాయపట్నం పోర్టుతో ఏపీకి ఎంతో ప్రయోజనం వుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దీని వల్ల ఆర్థిక లావాదేవీలు బాగా పెరుగుతాయని, ఎంతో మందికి కూడా ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేశారు. పోర్టులో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. పోర్టుతో రవాణా ఖర్చు తగ్గుతుందని, ప్రత్యక్షంగా వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం వివరించారు. రాష్ట్రంలో వున్న 6 పోర్టులు కాకుండా మరో 4 పోర్టులను కూడా తేబోతున్నామని ప్రకటించారు. త్వరలోనే మిగతా వాటికి కూడా భూమిపూజ చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఏపీ రూపు రేఖలే కాకుండా… పోర్టులు వున్న ప్రాంతాల రూపురేఖలు కూడా మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చైన్నై అయినా, విశాఖఅయినా, ముంబై అయినా… మెట్రో పాలిటన్ నగరాలుగా ఎదిగాయంటే… అక్కడ పోర్టులు వుండటం వల్లే సాధ్యమైందిన సీఎం అన్నారు. ఈ పోర్టుల ద్వారా మరో 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం కూడా వస్తుందని సీఎం జగన్ వివరించారు. దీంతో పాటు 9 ఫిషింగ్ హార్బర్లు కూడా కడుతున్నామని తెలిపారు. వీటి ద్వారా లక్ష మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు.
చంద్రబాబుపై ఫైర్ అయిన సీఎం జగన్…
పోర్టు ప్రారంభించిన తర్వాత, సభలో సీఎం జగన్ ప్రసగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. 2019 లో ెఎన్నికలు జరిగాయని, అప్పుడు శంకుస్థాపన అంటూ డ్రామాలు చేశారని మండిపడ్డారు. డీపీఆర్ లేదు, భూసేకరణ కూడా చేయలేదని మండిపడ్డారు. అయినా… ప్రజలను మోసం చేయడాని చూశారని అన్నారు. గత పాలనలో ఇలాంటివే చూవాం… రుణమాఫీ అంటూ మోసం చేశారని, చదువుకుంటున్న పిల్లల్ని కూడా మోసం చేశారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు.