ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఇరువురూ చర్చించుకోనున్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని రోజుల క్రిందటే ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. నీతి ఆయోగ్ సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, ఇతర విషయాలను నీతి ఆయోగ్ సమావేశంలో పేర్కొన్నారు. మళ్లీ కొన్ని రోజులకే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత కేంద్ర మంత్రులతో భేటీ అవుతారా? లేక.. అమరావతికి చేరుకుంటారా? అన్నది తెలియాల్సి వుంది.
