కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యా కానుక ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.వరుసగా మూడో ఏడాది విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. 47.40లక్షల మంది స్కూల్ విద్యార్థులకు విద్యా కానుక ఉపయోగపడుతుంది. విద్యా కానుక కింద స్టూడెంట్స్ కు ప్రత్యేక కిట్లు. ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థుల వరకు విద్యా కానుక అందజేస్తారు. ఒక్కో కిట్ విలువ దాదాపు రూ.2వేలు. విద్యా కానుక కోసం రూ.931.02కోట్లు వ్యయం. మూడేళ్లలో రూ.2,368కోట్ల సాయం అందనుంది. 47,40,421మంది విద్యార్థులకు అందజేయనున్నారు. విద్యా కానుక కింద 3జతల యూనిఫామ్..జత బూట్లు,2జతల సాక్సులు,బెల్లు,స్కూలు బ్యాగుతో పాటు తెలుగు,ఇంగ్లీష్ నోట్ బుక్స్, వర్క్ బుక్స్..అందజేయనున్నారు
