త్రివర్ణ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య 146 వ జయంత్యుత్సవాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని జగన్ ఆవిష్కరించారు. ఇక.. పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సీఎం ప్రారంభించారు.