స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రది రోజూ మధ్యాహ్నం 3 గటలనుంచి సాయంత్రం 5 గంటలవరకూ స్పందన కార్యక్రమంగా కచ్చితంగా జరగాలని సూచించారు. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన జరగాలని, సంబంధిత అధికారులు కచ్చితంగా స్పందనలో పాల్గొనాలని ఆదేశించారు. అలాగే ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలని సీఎం జగన్ సూచించారు.
ఉపాధిహామీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, పూర్తికాని ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్‌క్లినిక్స్‌ను అక్టోబరు నెలాఖరుకు పూర్తిచేయాలని సీఎం జగన్ అన్నారు. అలాగే స్పందనపై ప్రతి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో సమీక్ష చేయాలని, అదే సమయంలో ఎస్డీజీ లక్ష్యాలపైనా రివ్యూ చేయాలని పేర్కొన్నారు.
ఉపాధి హామీ పనుల సగటు వేతనం 240 వుండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. పూర్తికాని ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ క్లీనిక్స్ ను అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని అన్నారు. అక్టోబర్ 2 నాటికి గ్రామాల్లో జరుగుతున్న జగనన్న భూహక్కు మరియు హూ రక్షసర్వే పూర్తి కావాలని, సంబంధిత వ్యక్తుల చేతిలో జగనన్న భూరక్ష హక్కు పత్రాలు ఇవ్వాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు.