ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోదీకి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ తో పాటు అధికారులు, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి ప్రధాని భీమవరానికి బయల్దేరి వెళ్లారు. అక్కడ నిర్వహిస్తున్న సీతారామ రాజు 125 వ జయంత్యుత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి ప్రత్యేకంగా విల్లంబులిచ్చి.. స్వాగతం పలికారు.
