బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో సీఎం కేసీఆర్ బిజీ అయిపోయారు. ఓ వైపు తెలంగాణ రాజకీయాలను చక్కబెడుతూనే.. మరోవైపు పార్టీ విస్తరణపై కూడా వేగంగా అడుగులు వేస్తున్నారు. మరో యేడాదిలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తన BRS ను వేగంగా విస్తరించాలని చూస్తున్నారు. మొదటగా మహారాష్ట్ర, కర్నాటకలో తన పార్టీని విస్తరించేందుకు బలంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సదస్సును నాందేడ్ లో భారీ బహిరంగ సభ రూపంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువా కప్పి, సీఎం కేసీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సభ జరిగి… చాలా రోజుల తర్వాత తాజాగా… కేసీఆర్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడిని కూడా ప్రకటించారు. మహారాష్ట్ర బీఆర్‌ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మానిక్ కదమ్‌ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. తాజాగా… మహారాష్ట్రకి చెందిన కోఆర్డినేటర్లను కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు.
నాసిక్ -దశరథ సావంత్
పూణె- బాలాసాహెబ్ జైరాం దేశ్ ముఖ్
ముంబై- విజయ్ తనాజీ మోహితే
ఔరంగాబాద్ – సోమనాథ్ థోరట్
నాగపూర్ – ద్యానేష: వాకుడ్ కర్
అమరావతి – నిఖిల్ దేశ్ ముఖ్