గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సాగింది. భద్రాచలం వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ఆయన ఏటూరు నాగారం వెళ్లారు. భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకూ కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి నదిని పరిశీలించారు. విపత్తుతో విపరీతంగా ప్రవహిస్తున్నగోదావరిని, నదికి ఇరువైపులా జలమయమై, నీటిలో చిక్కుకున్న గ్రామాల్లో పరిస్థితిని సీఎం కేసీఆర్ పరిశీలించారు.
వరద ముంపు ప్రాంతాలపై ఏటూరు నాగారం సమీక్షా సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ బస్టర్ సృష్టిస్తున్నట్లు తమకు తెలిసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల వారు ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో లద్దాఖ్, లేహ్, ఉత్తరాఖండ్ లో ఇలాగే జరిగిందంటూ ఉదహరించారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాలపై కూడా ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ఆరోపించారు. భారీ వర్షాల వల్ల తలెత్తే ఉత్పాతానికి ఈ వరదలే నిదర్శనమంటూ అన్నారు. వరదల కారణంగా రాముల వారి ఆలయం ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
భద్రాచలం నుండి ఏటూరు నాగారం దిశగా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ హెలీకాప్టర్లో వరద ప్రభావిత ప్రాంతాల ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రకృతి విపత్తుతో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని, నదికి ఇరువైపులా జలమయమై, నీటిలో చిక్కుకున్న గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించారు. #TelanganaFloods pic.twitter.com/szOtdA4lXz
— Telangana CMO (@TelanganaCMO) July 17, 2022