ఒకే రోజు.. ఒకే ప్రాంతం.. రాష్ట్రానికి చెందిన ఇద్దరు ముఖ్యులు పర్యటిస్తున్నారు. ఒకరు గవర్నర్ తమిళిసై, మరొకరు సీఎం కేసీఆర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ వరంగల్ ద్వారా రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తే.. గవర్నర్ తమిళిసై రైలు మార్గంలో అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటనలపై ఆసక్తి నెలకొంది. తన పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ వరంగల్ కు ఒక రోజు ముందే చేరుకున్నారు. పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంత రావు ఇంట్లో బస చేసి, ఉదయం రోడ్డు మార్గం గుండా బయల్దేరారు. ఇక గవర్నర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి కొత్త గూడెం చేరుకున్నారు.
ఇక.. గవర్నర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ప్రారంభమైపోయింది. అశ్వాపురం మండలం బట్టీల గుంపు వద్ద బాధితులతో మాట్లాడారు. ఆ ప్రాంతానికి చెందిన సర్పంచ్ లు తమ సమస్యలపై వినతి పత్రం కూడా ఇచ్చారు. వరద బాధిత పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఇక సీఎం కేసీఆర్ కూడా భద్రాచలం చేరుకున్నారు. బ్రిడ్జిపై నుంచి గోదావరి పరిసర ప్రాంతాలను పరివీలించారు. గోదావరి నదికి సీఎం కేసీఆర్ శాంతిపూజ చేశారు. అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.