తెలంగాణ అంతటా జాతీయ గీతం జనగణమన తో మారుమోగింది. మంగళవారం ఉదయం 11:30 నిమిషాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అబిడ్స్ జీపీవో సర్కిల్ వద్ద జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశవ రావు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక తెలంగాణ అంతటా… ఈ జాతీయ గీతాలాపన కార్యక్రమం జరిగింది. అన్ని ట్రాఫిక్ జంక్షన్లలో నిమిషం పాటు రెడ్ సిగ్నల్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే సమయంలో జాతీయ గీతాలాపన చేశారు. మెట్రో రైళ్లతో సహా ఇతర వాహనాలను ఎక్కడికక్కడే నిలిపేసి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది.
