వరద ముంపు ప్రాంతాలపై ఏటూరు నాగారం సమీక్షా సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్ బస్టర్ సృష్టిస్తున్నట్లు తమకు తెలిసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల వారు ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో లద్దాఖ్, లేహ్, ఉత్తరాఖండ్ లో ఇలాగే జరిగిందంటూ ఉదహరించారు.
ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాలపై కూడా ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ఆరోపించారు. భారీ వర్షాల వల్ల తలెత్తే ఉత్పాతానికి ఈ వరదలే నిదర్శనమంటూ అన్నారు. వరదల కారణంగా రాముల వారి ఆలయం ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భద్రాచలం పుణ్య క్షేత్రాన్ని ముంపు నుంచి రక్షిస్తామని హామీ ఇచ్చారు. సీతమ్మ పర్ణశాల కూడా వరద నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.