భారీవర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అయితే.. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏరియల్ సర్వే అని అనుకున్నారు. కానీ వాతావరణ అనుకూలంగా లేకపోవడంతో సీఎం కేసీఆర్ హన్మకొండ నుంచి భద్రాచలానికి రోడ్డు మార్గాన బయలుదేరారు. హనుమకొండ నుంచి రోడ్డు మార్గంలో ములుగు జిల్లా ఏటూరు నాగారానికి వెళ్తారు. భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు.
అనంతరం భద్రాచలం నుంచి బయల్దేరి.. ఏటూరు నాగారం, ములుగు మండలాల్లో పరిస్థితిని సమీక్షించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ ఏటూరు నాగారానికి రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు వరద పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ శనివారమే వరంగల్ కు చేరుకున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు ఇంట్లో బసచేశారు.