రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr)నూతన సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ తాత మధు, సీఎస్ శాంతి కుమారి, సీపీ సీవీ ఆనంద్ వున్నారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు సీఎం. అయితే… ఏప్రిల్ 30 న కొత్త సచివాలయం ప్రారంభోత్సం జరగడానికి సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అలాగే జూన్ 2న అమరవీరుల చిహ్నం ఆవిష్కరణ జరుగనుంది.
అలాగే రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు అంటే ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆ తర్వాత సచివాలయమంతా పరిశీలించిన సీఎం కేసీఆర్… త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2 లోపు సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం ప్రారంభించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా నిర్మించిన సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టారు. అయితే.. ఫిబ్రవరి 17 నే సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. అయితే… ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారంగా నిలిచిపోయింది. దీంతో తాజాగా… కొత్త తేదీని నిర్ణయించారు.