తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భద్రాచలం- ఏటూరు నాగారం పర్యటనను ముగించుకొని సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అసెంబ్లీకి వెళ్లి, తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు స్పీకర్ పోచారం, ఇతర మంత్రులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే తమ మద్దతు అని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనకు మద్దతుగా హైద్రాబాద్ లో బహిరంగ సభను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.