ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, మంత్రి కేటీఆర్ తదితరులు బేంగపేట ఎయిర్ పోర్టులో యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ను యశ్వంత్ సిన్హాకు పరిచయం చేశారు.
బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఖైరతాబాద్ మీదుగా జలవిహార్ వరకూ 10 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ జలవిహార్ లో జరిగే మీటింగ్ లో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.