రెబెల్స్ ఎమ్మెల్యేల్లో 40 మంది ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవరని, కావాలంటే ఛాలెంజ్ కు కూడా సిద్ధమని మాజీ సీఎం ఉద్ధవ్ ప్రకటించారు. దీంతో సీఎం ఏకనాథ్ షిండే.. ఉద్ధవ్ పేరెత్తకుండానే ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. బీజేపీతో కలిసి ఘన విజయం సాధిస్తామని మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే ధీమా వ్యక్తం చేశారు.
రెబెల్స్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా గెలవరని కొందరు అంటున్నారని, కానీ… అందరూ గెలుస్తారని తాను బల్లగుద్ది చెబుతున్నానని షిండే ప్రకటించారు. రెబెల్స్ లో ఒక్కరు ఓడినా… తాను రాజకీయ సన్యాసం చేస్తానని సీఎం సంచలన ప్రకటన చేశారు. మాజీ సీఎం ఉద్ధవ్ ను ఉద్దేశించే.. షిండే ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు రెబెల్స్ గెలుస్తారు.. ఓడిపోతారు.. అని చెప్పడానికి వాళ్లెవరు? అంటూ షిండే ఫైర్ అయ్యారు. అదంతా ప్రజలే నిర్ణయిస్తారని, ఎవరూ నిర్ణేతలు కారని కుండబద్దలు కొట్టారు.