తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయన హోంఐసోలేషన్ లో వున్నారు. ఎంతకూ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆయనను కుటుంబీకులు చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. కోవిడ్ లక్షణాల కారణంగా సీఎం స్టాలిన్ ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించారు. అయితే… ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటన్ విడుదల చేయలేదు.
మంగళవారం స్టాలిన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, అలసట అనిపించడంతో కరోనా పరీక్షలు నిర్వహించుకున్నారు. పాజిటివ్ అని ఆ పరీక్షల్లో తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. చాలా అలసటగా అనిపిస్తోంది. కోవిడ్ పరీక్షలు చేసుకున్నా. పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. హోం ఐసోలేషన్ లో వుంటున్నా. అందరూ మాస్క్ ధరించండి. వ్యాక్సినేషన్ తీసుకోండి. జాగ్రత్తగా వుండండి అంటూ సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు.