చెన్నైలో జరగనున్న 44 వ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్ పోటీలకు హాజరు కావాలని సీఎం కేసీఆర్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. సీఎం స్టాలిన్ తన పార్టీ రాజ్యసభ సభ్యుడు గిరిజానన్ ద్వారా ఆహ్వానాన్నిసీఎం కేసీఆర్ కు పంపించారు. దీనినే వ్యక్తిగత పిలుపుగా భావించి… చెస్ ఒలంపియాడ్ పోటీలకు హాజరు కావాలని సీఎం స్టాలిన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరారు. 188 దేశాల నుంచి చెస్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, దేశంలో మొదటిసారిగా, ఆసియాలో మూడోసారి జరుగుతున్న ప్రతిష్ఠాత్మక పోటీలని సీఎం స్టాలిన్ వివరించారు. ఈ సందర్భంగా డీఎంకే ఎంపీ గిరిజానన్ సీఎం కేసీఆర్ కు శాలువా కప్పి, ఆహ్వానాన్ని అందజేశారు.