తమిళనాడులోని ప్రజా ప్రతినిధులందరికీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే వారి విషయంలో తానే నియంతగా మారతానని తీవ్రంగా హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. చెన్నైలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు తమ బాధ్యతలను భర్తలకు అప్పగించరాదని స్పష్టం చేశారు.
ప్రజాప్రతినిధులు చట్టానికి కట్టుబడే సేవలు చేయాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రూల్స్ బ్రేక్ చేసే వారిపై కఠిన చర్యలుంటాయి. ఎవరైనా క్రమశిక్షణా రాహిత్యంగా వుంటూ.. అక్రమాలకు పాల్పడితే మాత్రం సహించను. నేనే నియంతగా మారతా. కేవలం స్థానిక ప్రజా ప్రతినిధులకే కాదు.. అందరికీ వర్తిస్తుంది అంటూ స్టాలిన్ హెచ్చరించారు.