రెబెల్స్ కు, శివసేనకు మధ్య సంక్సోభం కొనసాగుతున్న వేళ.. సీఎం ఉద్ధవ్ థాకరే కీలకమైన పిలుపు ఇచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా గౌహతి నుంచి ముంబైకి తిరిగి వచ్చేయాలని పిలుపునిచ్చారు. తనతో కూర్చొని మాట్లాడితే కచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని సీఎం సూచించారు. రెబెల్స్ లో చాలా మంది తమతో టచ్ లోనే వున్నారని, అంతేకాకుండా శివసేన గుండెల్లో వుంటారని సెంటిమెంట్ వ్యాఖ్యలు చేశారు.
రెబెల్స్ అందరూ వచ్చేయాలి, అప్పుడే ఓ పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ఇంకా సమయం మించిపోలేదని, కూర్చొని మాట్లాడుకుందామని సీఎం ఉద్ధవ్ పిలుపునిచ్చారు. శివసైనికులు, ప్రజల్లో ఏర్పడిన అనేక సందేహాలను తొలగించాలని, ఎవరి మాటలకూ లొంగిపోవద్దని, శివసేన ఇచ్చిన గౌరవం ఎక్కడా దొరకదని సీఎం పేర్కొన్నారు.