ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చార్మినార్ వద్ద వున్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు యోగి హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యోగికి ఆలయ కమిటీ భాగ్యలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని కూడా బహూకరించింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్, సీఎం యోగి ఆలయ కమిటీ సన్మానించింది. యోగి వెంట బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, పలువురు బీజేపీ నేతలు వచ్చారు.
యోగి రాక సందర్భంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 350 పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. యోగి భాగ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్న తర్వాత తిరుగు పయనం అవుతున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బుల్డోజర్ బాబా జిందాబాద్… భారత్ మాతాకీ జై… జై శ్రీరాం.. అంటూ నినాదాలు చేశారు.