యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. హైటెక్స్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి వస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. యోగికి స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. అక్కడి నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటారు.
ముందటి షెడ్యూల్ ప్రకారం సీఎం యోగి చార్మినార్ వద్ద వున్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించాల్సి వుంది. అయితే వివిధ కారణాల రీత్యా ఈ పర్యటన వాయిదా పడిందని బీజేపీ పేర్కొంది. ఆదివారం ఉదయం సీఎం యోగి భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తారని ప్రకటించింది. అయితే.. మొదట పార్టీ సమావేశాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే పర్యటనకు సమయం ఇవ్వాలని బీజేపీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది.