కలర్స్ ప్రోగ్రాం ద్వారా తన పేరే కలర్స్ స్వాతిగా స్థిరపడిపోయిన కలర్స్ స్వాతి మళ్లీ మూవీలో కనిపించనున్నారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మంత్ ఆఫ్ మధు అన్న సినిమాలో కనిపిస్తోంది. నవీన్ చంద్ర హీరోగా… శ్రీకాంత్ నాగోతి దర్శకుడిగా వుంటున్నారు. యశ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా.. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది.
కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాలో కలర్స్ స్వాతి నటించింది. ఆ తర్వాత వెంకటేశ్ సినిమా ఆడవారి మారి మాటలకు అర్థాలే వేరులే అన్న సినిమాలో అద్భుతంగా నటించి ఒక్క సారిగా తళుక్కు మంది. కార్తికేయ, త్రిపుర, స్వామిరారా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. మళయాళం సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు పెళ్లి చేసుకొని, ఇండస్ట్రీకి దూరంగా వున్నారు. మళ్లీ రాబోతున్నారు.