కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే నల్లగొండ నేతలతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జీ మాణిక్కం ఠాగూర్ చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా కోమటిరెడ్డిపై సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.
షోకాస్ నోటీసులు లేకుంటే సస్పెన్షన్ మాత్రం కచ్చితంగా వుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణలో ఎలాగైనా అత్యధిక సీట్లు సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే… తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయమని కోమటిరెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. మరోవైపు మునుగోడు కార్యకర్తలతో కూడా వరుసగా భేటీ అయిన విషయం కూడా కాంగ్రెస్ కంటిలో పడిందని తెలుస్తోంది. కోమటిరెడ్డి వ్యవహారాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని కూడా పేర్కొన్నారు.