కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక జ్యోతిష్కుడిని నియమించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఎద్దేవా చేశారు. నిర్మలా సీతారామన్ తన సొంత నైపుణ్యాలపై ఆశలు వదిలేసుకున్నారని, అందుకే గ్రహాలవైపు చూస్తున్నారని చిదంబరం ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి, గాడిలో పెట్టడానికి గ్రహాల వైపు చూస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇటీవల కొన్ని ఇమేజెస్ ను ఆవిష్కరించింది. యురేనస్, ప్లూటో, జుపిటర్ కు సంబంధిత చిత్రాలను నాసా షేర్ చేసింది. ఈ చిత్రాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రీట్వీట్ చేశారు. దీని ఆధారంగానే చిదంబరం విమర్శలు చేశారు. తమ ఆర్థిక సలహాదారులపై నమ్మకం లేకనే.. మంత్రి గ్రహాల వైపు చూస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు చేశారు.