కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసి పార్టీని ఇరకాటంలోకి నెట్టేశారు. గాంధీలు, నెహ్రూ పేర్లతో కాంగ్రెస్ నేతలు తరతరాలకు కావాల్సినంత డబ్బులను సంపాదించుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ 90 కోట్ల మనీలాండరింగ్ అవినీతిపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనలను నిర్వహించింది.
ఇందులో భాగంగా కర్నాటకలోనూ ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన కార్యక్రమంలో రమేశ్ పాల్గొంటూ.. పై వ్యాఖ్యలు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిర, సోనియా గాంధీల పేర్లు చెప్పి మనం 3-4 తరాలకు సరిపడా డబ్బులు సంపాదించుకున్నాం. వాటి రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. తిరిగిచ్చేయాలి. ఇంత మాత్రం త్యాగం చేయకపోతే మనకే మంచిది కాదు అంటూ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.