రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెబుతూ లేఖ రాశారు. పొరపాటున నోరు జారానని, తన క్షమాపణలను అంగీకరించాలని ద్రౌపది ముర్మును ఆయన కోరారు. అత్యున్నత పదవి గురించి మాట్లాడుతూ పొరపాటున నోరు జారాను. పొరపాటున తప్పుడు పదం వాడాను… క్షమించండి.. విచారం వ్యక్తం చేసేందుకే లేఖ రాస్తున్నాను అంటూ కాంగ్రెస్ ఎంపీ చౌధరి తన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల అధీర్ రంజన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ముర్మును సంబోధిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రపతి బదులు రాష్ట్రపత్ని అంటూ సంబోధించారు. దీంతో బీజేపీ నేతలు పార్లమెంట్ వెలుపల, బయట తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ఈ మాటలకు బాధ్యత వహిస్తూ… కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజీనామా చేయాలని బీజేపీ మహిళా ఎంపీలు, కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు. దీంతో అధీర్ రంజన్ చౌదరి వెనక్కి తగ్గారు. అత్యున్నత పదవి గురించి మాట్లాడుతూ.. పొరపాటున తప్పుడు పదం వాడాను. దీనిపై విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాస్తున్నాను అంటూ అధీర్ ఆ లేఖలో పేర్కొన్నారు.