ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దేశంలోనిరుద్యోగాన్ని పెంచుతూ.. కోట్లాది కుటుంబాల నమ్మకాల్ని బద్దలు కొట్టారంటూ విమర్శించారు. అంతేకాకుండా నియంతృత్వంతో దేశ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కింద కానిస్టేబుల్ డ్యూటీకి పరీక్షలు రాసిన అభ్యర్థులు చేస్తున్న నిరసనను రాహుల్ జోడిస్తూ మోదీపై ట్విట్టర్ వేదిగా కామెంట్స్ చేశారు. ప్రశ్నలు అడగవద్దు.. నోరు మెదపొద్దు. శాంతిపూర్వకంగా నిరసన చేపట్టవద్దు. హక్కుల కోసం డిమాండ్ చేస్తే అరెస్టులే. ఈ ప్రభుత్వం దేశ భవిష్యత్తును నాశనం చేస్తోంది అంటూ రాహుల్ ఫైర్ అయ్యారు.
सवाल मत पूछो
आवाज़ मत उठाओ
शांतिपूर्ण प्रदर्शन मत करो
नए भारत में हक मांगने पर होगी गिरफ़्तारीयुवाओं को बेरोज़गार बना कर, करोड़ों परिवारों की आस तोड़ कर, देश का भविष्य उजाड़ रही है ये तानाशाह सरकार। pic.twitter.com/7QKk8XnlMi
— Rahul Gandhi (@RahulGandhi) July 17, 2022