కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చిత్తశుద్ధే లేదని విమర్శించారు. కాళేశ్వరం ఇరిగేషన్ కు ఏమాత్రం ఉపయోగపడటం లేదని, కేవలం టూరిస్ట్ స్పాట్ గానే మారిపోయిందంటూ ఆరోపించారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడే కాళేశ్వరాన్ని నిర్మించారని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును వేరే చోట నిర్మించడం వల్ల నష్టం జరుగుతోందని, తాము అధికారంలోకి వస్తే తుమ్మిడిహట్టి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ ప్రాజెర్ట్, పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపును ప్రభుత్వం అడ్డుకోవడంలేదని మండిపడ్డారు. కాళేశ్వరంలో అవినీతిపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని ఎంపీ ఉత్తమ్ డిమాండ్ చేశారు.
