నిరుద్యోగం, ధరల పెరుగుదలపై మరింత పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా వచ్చే నెల 5 న దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని పార్టీ ముఖ్యులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని కూడా ముట్టడిస్తామని ప్రకించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కొందరు నేతలను పురమాయించారు. కాంగ్రెస్ ఎంపీలు అందరూ పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ర్యాలీ నిర్వహిస్తారని పార్టీ ప్రకటించింది. అలాగే… రాష్ట్రాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రాజ్ భవన్ ముట్టడి చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. అయితే.. ప్రధాని ఇంటి ముట్లడిలో మాత్రం కేవలం సీనియర్లు మాత్రమే పాల్గొనాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ నిత్యావసర ధరల పెరుగుదలపై రోజూ నిరసన వ్యక్తం చేస్తూనే వుంది. నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే.
