డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ద్రవిడ కజగం సమావేశంలో ఆయన ఆవేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. తన నాయకుడు, తమిళనాడు సీఎం స్టాలిన్, ద్రవిడ కజగం అధ్యక్షుడు కే వీరమణిను ఎవరైనా ముట్టుకుంటే వాళ్ల చేయి నరికేస్తాని హెచ్చరించారు. ఇలా చేయడం తన ధర్మమని, సరైనది కాదని ఎవరైనా భావిస్తే కోర్టుకు వెళ్లి చెప్పొచ్చని, అప్పటికే తాను ఈ పని చేసేస్తానన్నారు. ద్రవిడ కజగం అధికార డీఎంకే పార్టీకి భావజాలపరంగా మాతృసంస్థ. కాగా, సేతుసముద్రం షిప్ కెనాల్ ప్రాజెక్టును మధ్యంతరంగా కేంద్రం నిలిపివేయడాన్ని ఆయన తప్పుపట్టారు.
