తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద సహాయక చర్యలపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విపత్తుల నిర్వాహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కూడా పాల్గొన్నారు. అయితే.. పరిస్థితి అదుపులోనే వుందని, ఏవిధమైన భారీ నష్టం జరగలేదని సీఎస్ సోమేశ్ ప్రకటించారు.
గోదావరీ పరివాహక ప్రాంతాలల్లో వున్న జిల్లాలపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించామని, ములుగు, భూపాలపల్లి, భద్రాచలం జిల్లాలపై మరింత అప్రమత్తంగా వున్నామని పేర్కొన్నారు. వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని కాపాడామని, ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు కూడా రక్షిస్తున్నాయని తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో 223 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని, ఇందులో 19 వేల మందికి షెల్టర్ ఇచ్చామని సీఎస్ వివరించారు.